ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన పుష్ప సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు పుష్ప సినిమా పోస్టర్ చూసాను, ఆ సినిమాను నేను చూస్తాను.. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి పుష్ప సినిమాలో చూపించారు.
ఆ సినిమాలో విధంగా ఏపీలోనూ జరుగుతోందని ఆయన అన్నారు. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు స్మగ్లింగ్‌ను అరికట్టేందకు వేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను రద్దు చేశారని ఆయన అన్నారు. అయితే ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో జనాగ్రహ సభ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు.