Site icon NTV Telugu

Kothapalli Geetha Arreste: మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్.. కారణం ఇదే..?

Kothapalli Geetha

Kothapalli Geetha

ఆంధ్రప్రదేశ్‌లోని అరుకుకు చెందిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్‌ చేశారు సీబీఐ అధికారులు… ఇవాళ హైదరాబాద్‌లో కొత్తపల్లి గీతను అదుపులోకి తీసుకున్న సీబీఐ టీమ్.. బెంగళూరుకు తరలించింది… అయితే, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రూ. 52 కోట్లు లోన్‌ తీసుకునుఒ ఎగ్గొట్టినట్టు గీత దంపతులపై అభియోగాలున్నాయి… విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రూ. 52 కోట్లు రుణంగా తీసుకున్న కొత్తపల్లి గీత దపంతులు.. తిరిగి చెల్లించని కారణంగా.. సంబంధిత బ్యాంకు అధికారుల ఫిర్యాదు చేశారు.. దీంతో.. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు గీతను అరెస్ట్ చేశారు.

Read Also: Goa CM Pramod Sawant: ‘కాంగ్రెస్ చోడో యాత్ర’ గోవా నుంచి ప్రారంభమైంది..

కాగా, 2014లో అరకు నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన విషయం సాధించిన ఆమె.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.. అయితే, 2015లో పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ ఫిర్యాదు మేరకు కొత్తపల్లి గీతపై కేసు నమోదు చేసింది సీబీఐ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.. గీతతో పాటు ఆమె భర్త, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీపై కూడా కేసు నమోదైంది.. వీరి కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ42.79 కోట్లు నష్టం వాటిల్లందని చార్జిషీట్ లో పేర్కొంది సీబీఐ.. మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంక్ అధికారులపై కూడా కేసులు పెట్టింది… ఐపీసీ 120, 420, 458, 421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సీబీఐ.. ఇప్పుడు కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసింది.

Exit mobile version