NTV Telugu Site icon

ఏపీకి కాపు సీఎం కావాలి : మాజీ ఎంపీ

ఏపీలో కాపుల జనాభా కోటి మంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కాపు అభ్యర్థి ఉండాలని తిరుపతి కాంగ్రెస్ మాజీ ఎంపి చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 70 ఏళ్ల లో కాపులు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదని, కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా, వారిలో చైతన్యం అవసరమని ఆయన అన్నారు.

అంతేకాకుండా అన్ని పార్టీలను కలిసి కాపులను ముఖ్యమంత్రి చేయాలని కొరతానన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయన్నారు. 80 లక్షలకుపైగా ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ, బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్స్ నిలిచిపోయాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల స్కాలర్ షిప్పులు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా చింతామోహన్ రెడ్డి, కమ్మలకు రాష్టాన్ని పాలించే అర్హత లేదంటూ ధ్వజమెత్తారు.