former MLA Neeraja Reddy Died in road accident: కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి మరణించారు. గతంలో నీరజా రెడ్డి ఆలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. కారు టైర్ పేలడంతో ఫార్చూనర్ కారు ప్రమాదానికి గురైంది.
Read Also: SS Karthikeya: మా అమ్మను పెళ్లి చేసుకోవడానికి ముందే రాజమౌళి మా ఇంటికి వచ్చి..
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి మరణించారు. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తుండగా కారు టైర్ పేలిపోవడంతో డివైడర్ ని ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన ఫార్చునర్ కారు నుజ్జునుజ్జైంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో నీరజా రెడ్డి తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించారు, చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు.