NTV Telugu Site icon

AP Fibernet : ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్..

Apfiber Net

Apfiber Net

Fibernet MD Suspend: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ అయ్యారు. ఫైబర్ నెట్ కార్పోరేషన్ లో తన అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగుల నియామకం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి.

Read Also: Raksha Bandhan-2024: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క..

కాగా, ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించిన మధుసూదన్ రెడ్డి.. హెడ్ క్వార్టర్సు విడిచి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ జీవో విడుదల చేసింది. ఇక, ఫైబర్ నెట్ కార్పోరేషనులో రూ. 800 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆంధ్ర ప్రధేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణకు ఆదేశించాలని ఏపీ సర్కార్ యోచిస్తుంది. ఇక, ఫైబర్ నెట్ మాజీ ఎండీపై విచారణలో భాగంగా రైల్వే శాఖకు ప్రభుత్వం లేఖ రాసింది. మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ రైల్వే బోర్డుకు లేఖ రాసింది. మరో రెండు రోజుల్లో ఏపీలో ముగుస్తున్న మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్.. రైల్వే అకౌంట్స్ సర్వీసు నుంచి 2019 ఆగస్టు 26 తేదీన రాష్ట్రానికి మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ పై వచ్చారు.

Read Also: Top Headlines @1PM : టాప్ న్యూస్

కాగా, 2024 ఆగస్టు 22 తేదీతో మధుసూదన్ రెడ్డి డిప్యూటేషన్ గడువు ముగుస్తుంది. ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలపై విచారణ వల్ల మధుసూధన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విచారణ జరుగుతున్న విషయాన్ని రైల్వే బోర్డు దృష్టికి సర్కార్ తీసుకువెళ్లింది. ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలపై విచారణ దృష్ట్యా మరో ఆరు నెలల పాటు మధుసూధన్ రెడ్డి డిప్యూటేషన్ పొడిగించాలని ఏపీ సర్కార్ కోరుతూ లేఖ రాసింది.