Somesh Kumar: సోమేష్ కుమార్‌కు వీఆర్ఎస్.. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.. నెక్ట్స్ ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somesh Kumar: సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారు.. వీఆర్ఎస్ కోరుతూ సోమేష్ కుమార్ చేసుకున్న దరఖాస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేసిన విషయం విదితమే.. అయితే, సీఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లినా.. వెంటనే వీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఆది నుంచి జరుగుతూ వచ్చింది.. మరోవైపు.. ఈ ఏడాది చివర్లో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో.. అప్పటి వరకు పదవిలో కొనసాగుతారని..! పూర్తి స్థాయి సర్వీస్ కంప్లీట్ చేస్తారని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.. అయితే, ఏపీ జీఏడీలో రిపోర్టు చేసిన సోమేష్ కుమార్.. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. ఇక, రిపోర్ట్ చేసిన నాటి నుంచే సోమేష్ వీఆర్ఎస్ అప్లై చేస్తారని ప్రచారం సాగుతూ వచ్చింది.. వీఆర్ఎస్ కు అప్లై చేసుకుంటానని ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడంతోనే సోమేష్ కుమార్‌కు ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు..
Read Also: Undavalli Arun Kumar: ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. అది వైసీపీకి మైనస్..!
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
మొత్తంగా సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం.. దానికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆయన వీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్టు అయ్యింది.. కాగా, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో బీహార్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సోమేష్ కుమార్‌ను ఏపీ క్యాడర్‌కు కేటాయించారు.. అయితే, క్యాట్ ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. కానీ, క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయడంతో హైకోర్టు ఆయనను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేయడం.. మరో అవకాశం లేకపోవడంతో ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు.. ఇక, హైకోర్టు ఆదేశాల తర్వాత సోమేష్ కుమార్‌కు ఏపీకి వెళ్లడం ఇష్టంలేదని.. వీఆర్‌ఎస్ తీసుకుంటారని.. గతంలో కొందరు కీలక అధికారులను తన సలహాదారులుగా పెట్టుకున్న సీఎం కేసీఆర్.. సోమేష్ కుమార్‌ను కూడా తన దగ్గర పెట్టుకుంటారనే ప్రచారం సాగింది.. మరి, ఇప్పుడు ఏపీలో వీఆర్ఎస్ తీసుకున్న సోమేష్ కుమార్.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎలాంటి పోస్ట్ ఇస్తారు.. ఆయన సేవలను ఎలా వినియోగించుకోనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!