Site icon NTV Telugu

Somesh Kumar: సోమేష్‌ కుమార్‌కు వీఆర్ఎస్‌.. సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. నెక్ట్స్ ఏంటి..?

Somesh Kumar

Somesh Kumar

Somesh Kumar: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ వీఆర్ఎస్‌ తీసుకున్నారు.. వీఆర్ఎస్‌ కోరుతూ సోమేష్ కుమార్ చేసుకున్న దరఖాస్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ సోమేష్‌ కుమార్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్‌ చేసిన విషయం విదితమే.. అయితే, సీఎస్‌గా ఉన్న సోమేష్‌ కుమార్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లినా.. వెంటనే వీఆర్ఎస్‌ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఆది నుంచి జరుగుతూ వచ్చింది.. మరోవైపు.. ఈ ఏడాది చివర్లో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో.. అప్పటి వరకు పదవిలో కొనసాగుతారని..! పూర్తి స్థాయి సర్వీస్‌ కంప్లీట్‌ చేస్తారని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.. అయితే, ఏపీ జీఏడీలో రిపోర్టు చేసిన సోమేష్‌ కుమార్‌.. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. ఇక, రిపోర్ట్ చేసిన నాటి నుంచే సోమేష్ వీఆర్ఎస్ అప్లై చేస్తారని ప్రచారం సాగుతూ వచ్చింది.. వీఆర్ఎస్ కు అప్లై చేసుకుంటానని ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడంతోనే సోమేష్ కుమార్‌కు ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు..

Read Also: Undavalli Arun Kumar: ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. అది వైసీపీకి మైనస్‌..!

మొత్తంగా సోమేష్‌ కుమార్‌ వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం.. దానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. ఆయన వీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్టు అయ్యింది.. కాగా, ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో బీహార్‌కు చెందిన 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన సోమేష్‌ కుమార్‌ను ఏపీ క్యాడర్‌కు కేటాయించారు.. అయితే, క్యాట్‌ ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. కానీ, క్యాట్‌ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేయడంతో హైకోర్టు ఆయనను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేయడం.. మరో అవకాశం లేకపోవడంతో ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు.. ఇక, హైకోర్టు ఆదేశాల తర్వాత సోమేష్‌ కుమార్‌కు ఏపీకి వెళ్లడం ఇష్టంలేదని.. వీఆర్‌ఎస్‌ తీసుకుంటారని.. గతంలో కొందరు కీలక అధికారులను తన సలహాదారులుగా పెట్టుకున్న సీఎం కేసీఆర్.. సోమేష్‌ కుమార్‌ను కూడా తన దగ్గర పెట్టుకుంటారనే ప్రచారం సాగింది.. మరి, ఇప్పుడు ఏపీలో వీఆర్ఎస్‌ తీసుకున్న సోమేష్‌ కుమార్‌.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఎలాంటి పోస్ట్‌ ఇస్తారు.. ఆయన సేవలను ఎలా వినియోగించుకోనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version