NTV Telugu Site icon

జూన్ నెల టిక్కేట్లను ఆన్ లైన్ లో విడుదల చేసిన టీటీడీ…

తిరుమల శ్రీవారిని నిన్న 5788 మంది భక్తులు దర్శించుకున్నారు. 2258 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండి ఆదాయం 24 లక్షలుగా ఉంది. అయితే ఇవాళ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునరుద్ధరణ జరుగుతుంది. అలాగే జూన్ నెలకుకు సంభందించి ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును విడుదల చేసింది టీటీడీ. కానీ కోవిడ్ కారణంగా దర్శనాలు సంఖ్యని 5 వేలకు తగ్గించింది టీటీడీ. అయితే ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గుతూనే ఉంది.