NTV Telugu Site icon

Bapatla Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Bapatla Road Accident

Bapatla Road Accident

Five Dead In Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 16వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి.. ఎదురుగా వస్తున్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు అద్దంకి ఎస్సై సమందర్ వళి కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఎస్సై సమందర్ వళి భార్య వహీదా (36), కుమార్తె అయేషా (9), బంధువులు గుర్రాల జయశ్రీ (50), గుర్రాల దివ్యతేజ (29), డ్రైవర్ బ్రహ్మచారి (22) ఉన్నారు. ఒంగోలు నుండి హైదరాబాద్ వెళ్తుండగా.. కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Bhakthi TV: మీరు తలపెట్టిన కార్యం అనుకున్నట్లుగా జరుగాలంటే ఈ స్తోత్రాలు వినండి

ఒంగోలు నుంచి హైదరాబాద్‌కి వెళ్తున్న సమయంలో.. మేదరమెట్ల వద్ద కారు టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో కారు అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌పై నుండి ఎదురు లైన్‌లోకి కారు దూసుకెళ్లిన కారు.. అటుగా లారీని ఢీకొంది. దీంతో.. కారులో ఉన్న వాళ్లందరూ స్పాట్‌లోనే చనిపోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎస్సై సమందర్ వలి విధి నిర్వహణలో ఉన్నారు. ఈ ఘటనలో కారులో ఇరుక్కుపోయిన ఇద్దరిని హైవే పోలీసులు బయటకు తీశారు. ఈ ప్రమాదం గురించి సమాచారం ఇవ్వగానే.. సమందర్ వల్లి ఘటనా స్థలికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసి.. ఆయన రోడ్డుపైనే కన్నీరుమున్నీరు అయ్యారు. ఆయన రోధించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Nandamuri Tarakaratna: తారకరత్న మృతి.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Show comments