Site icon NTV Telugu

FishAndhra Brand: జీవో 217పై అపోహలు వద్దు

ఏపీలో జీవో నెంబర్ 217పై విపక్షాలు-అధికార పార్టీ నేతల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. మత్స్యకార అభ్యున్నతి పేరుతో నర్సాపురంలో జనసేన బహిరంగ సభ నిర్వహించింది. జీవో నెంబర్ 217 పై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా దేశీయ మత్స్యకారుల అభ్యున్నతికి కోసం జారీ చేసిన జీవో ఇది అన్నారు మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 27,360 చెరువుల్లో మత్స్య సంపదను పెంచుకుదుకు అవకాశం ఉందన్నారు.

100 హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్న 582 చెరువుల్లో మాత్రమే ఈ జీవో వర్తిస్తుంది.అందులోనూ 337 చెరువుల్లో 255 మత్స్యకార సంఘాలు లీజుకు తీసుకుని చేపలు పట్టుకుంటున్నాయి.ప్రస్తుతం నెల్లూరులోని 27 చెరువుల్లో మాత్రమే పైలెట్ ప్రాతిపదికన 217 జీవో అమలు అవుతోంది.మిగిలిన 310 చెరువుల్లో ఇంకా అమలు చేయడం లేదు.మత్స్యకార సంఘాల సభ్యులకు మరింత ఆదాయం సమకూర్చే విషయంలో ఈ జీవో అమలు చేస్తున్నాం అని వివరించారు కన్నబాబు.

దళారులు సొమ్ము చేసుకుంటున్నారన్న అంశంపై అధ్యయనం చేసి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నాం.ఆదాయం మత్స్యకార సంఘాలకు చెందేలా వేలం ద్వారా 30 శాతం ఆదాయం లేదా 15 వేల చొప్పున రెవెన్యూ అందించేలా చర్యలు తీసుకున్నాం.నెల్లూరు జిల్లాలో విజయవంతం అయితేనే మిగతా ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం.100 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు ఈ జీవో వర్తించదని గుర్తించాలి.ఫిష్ ఆంధ్రా అనే బ్రాండ్ ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి.46 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తిలో 30 శాతం మేర స్థానికంగా వినియోగించాలని ప్రభుత్వ లక్ష్యం అన్నారు కన్నబాబు.

https://ntvtelugu.com/pawan-kalyan-key-comments-at-narsapuram-public-meeting/

ప్రస్తుతం ఏడాదికి 8 కేజీల మత్స్య ఉత్పత్తులు మాత్రమే తలసరి వినియోగం ఉంది.పులివెందులలో పైలట్ ప్రాతిపదికన ఫిషింగ్ హబ్ ఏర్పాటైంది.ట్రయల్ రన్ గా 20 చోట్ల చేస్తున్నాం.సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న రాష్ట్రంగా ఏపీలో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం రూ. 3177 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది.ప్రాధాన్యత క్రమంలో ప్రతీ జిల్లాలోను ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు.ప్రస్తుతం 4 ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలయ్యాయి.మిగతా 5 టెండర్ల దశలో ఉన్నాయని వెల్లడించారు కన్నబాబు.

అలాగే 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కోసం డీపీఆర్‌ లు సిద్ధం.ప్రస్తుతం రాష్ట్రంలో 340 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ యూ ఉన్నాయి అక్కడ కూడా రూ. 90 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన. మత్స్య ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్నా దేశీయంగా వినియోగం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. పూర్తి ఆరోగ్యకరమైన పరిస్థితిలో 70 హుబ్స్, 14 వేల రీటైల్ అవుట్ లెట్లు కూడా ఏర్పాటు అవుతాయి. రీటైల్ అవుట్ లెట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు. రోడ్డు పక్కన విక్రయాలు చేసుకునే మత్స్యకారులకు సౌలభ్యం కలిగించే ప్రయత్నం ఇది. మత్స్యకారుల సంక్షేమం కోసం చేస్తున్న ప్రయత్నం అన్నారు కన్నబాబు.

Exit mobile version