NTV Telugu Site icon

Sri Rama Navami Celebrations: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి

Fire Broke Out

Fire Broke Out

Sri Rama Navami Celebrations:తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. ప్రతీ వాడ, ప్రతీ గ్రామం, ప్రతీ గుడిలో అనే విధంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భక్తులు చెబుతున్నారు. చిన్న ప్రమాదం జరిగినా.. భయంతో పరుగులు తీశారు భక్తులు.. అంతా సురక్షితంగా బయటపడడంతో.. అటు భక్తులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Agency Bandh: ఏజెన్సీ బంద్‌కు ఆదివాసీల పిలుపు.. ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు..