NTV Telugu Site icon

విశాఖ మధురవాడలో విషాదం… నలుగురు మృతి… పలు అనుమానాలు 

విశాఖపట్నంలోని మధురవాడలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది.  ఆదిత్య ఫార్చూన్ టవర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.  ఆదిత్య ఫార్చూన్ టవర్ లోని ప్లాట్ నెంబర్ 505 లో ఈ ప్రమాదం జరిగింది.  మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.  మృతులు బంగారునాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ లుగా గుర్తించారు.  అయితే, ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  పోలీసులు ఘటనా స్థలాన్ని క్లూస్ టీం తో పరిశీలిస్తున్నారు.