NTV Telugu Site icon

Fire Accident in Sankranthi Celebrations: స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు.. భోగి మంటల్లో అపశృతి

Fire Accident

Fire Accident

Fire Accident in Sankranthi Celebrations: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది.. అంతకంటే ముందే.. సంక్రాంతి సెలవులు వస్తాయి.. దీంతో.. ముందుగానే స్కూల్స్‌, కాలేజీలు, విద్యాసంస్థల్లో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది.. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ప్రైవేటు పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు వేశారు.. అయితే, ఆ మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.. బాధిత విద్యార్థులను అమలాపురంలోని ‌శ్రీనిధి ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆస్పత్రిలోనే విద్యార్థులు చికిత్స పొందుతున్నారు..

Read Also: Chiranjeevi: హీరోలు ఎందుకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి.. చిరు సూటి ప్రశ్న

గొల్లవిల్లిలోని విజడమ్ స్కూల్‌లో ఈ ప్రమాదం జరిగింది. గాయాలపాలైన ముగ్గురు విద్యార్థుల్లో.. ఇద్దరు చిన్నారులు మూడో తరగతి చదువుతుండగా.. ఓ యూకేజీ బాలుడికి కూడా గాయాలయ్యాయి.. పిల్లలు బోగిమంట దగ్గర ఉండగా.. మంటలపై పెట్రోల్‌ పోయడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగి విద్యార్థులకు అంటుకున్నాయి.. ఇక, విద్యార్థుల విషయంలో ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించారంటూ స్కూల్‌ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.. స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తు్న్నారు.. గాయపడిన విద్యార్థులు 1. వనిషా (8) మూడవ తరగతి.. 2. మధుర కీర్తన (8) మూడవ తరగతి.. 3. సామియల్ స్టీఫెన్ (6) యూకేజీగా గుర్తించారు.. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇక, సాధారణంగా సంక్రాంతి సందర్భంగా పాఠశాలల్లో ముగ్గుల పోటీలు, ఇతర పోటీలు పెడతారు. భోగి మంటలు వంటి కార్యక్రమాలకు మాత్రం అధికారులు అనుమతి ఇవ్వరని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు..