NTV Telugu Site icon

Father Cruelty: తండ్రి కాదు రాక్షసుడు.. ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని వార్నింగ్

Father

Father

తండ్రి అంటే ఇలా వుండకూడదని నిరూపించాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి కర్కశత్వం బయటపడింది. కువైట్ వెళ్ళిన భార్య గంజి నిర్మల వెనక్కి రాకపోతే ఇద్దరు పిల్లల్ని చంపేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు భర్త గంజి ప్రసాద్. ఇద్దరు ఆడపిల్లల్ని చావగొడుతు, కత్తితో నరికేస్తా అంటూ బెదిరిస్తూ భార్యకు వీడియో మెసేజ్ లు పంపాడు గంజి ప్రసాద్.

తమను కొట్టవద్దని ప్రాధేయపడినా ఆ తండ్రి రాక్షస హృదయం కరగలేదు. తాగిన మత్తులో ఊగిపోతూ.. గొడ్డుని బాదినట్టు పిల్లల్ని హింసించాడు ఆ తండ్రి. ఈ వీడియోలను పోలీసులకు పంపిన నిర్మల తమ పిల్లల్ని రక్షించాలని కోరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని తమ సంరక్షణలో ఉంచుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. తాడేపల్లి గూడెం సమీపంలోని పెంటపాడు ఎస్సీ కాలనీకి చెందిన డేవిడ్ రాజు ఇంట్లోనే వుంటున్నాడు.

Read Also: Hyderabad Crime: బాలిక గ్యాంగ్‌ రేప్‌ కేసులో కొత్త ట్విస్ట్.. ఇంత జరిగిందా..?

జీవనోపాధి కోసం భార్య గంజి నిర్మలను కువైట్ పంపించాడు. తరచూ తాగి వచ్చి ఇద్దరు ఆడపిల్లల్ని హింసించడం ప్రారంభించాడు. తల్లి కూడా దగ్గర లేకపోవడంతో గంజి ప్రసాద్ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. భార్యకు అక్రమ సంబంధం వుందని అనుమానంతో పిల్లలకు నరకం చూపించసాగాడు. దుబాయ్ నుంచి త్వరగా రాకుంటే పిల్లల్ని చంపేస్తానంటూ వీడియోలు తీశాడు. పెంటపాడు పోలీసులు ఇంటికి చేరుకోగా.. తాగుబోతు తండ్రి అక్కడినించి పరారయ్యాడు. గంజి ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ కర్కశుడైన తండ్రిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు పోలీసులను కోరుతున్నాయి.

Read Also: Adivi Sesh: ‘హిట్ 2’ థియేటర్లను హిట్ చేసేది ఎప్పుడంటే..?

Show comments