NTV Telugu Site icon

Draksharamam: అపరిశుభ్రతపై కలెక్టర్‌ సీరియస్‌.. ఈవోతో ఫ్యాన్‌ తుడిపించి..!

Draksharamam

Draksharamam

పర్యావరణం, పరిశుభ్రతపై ప్రభుత్వం, సంస్థలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.. అయితే, ప్రజల రద్దీ ఉండే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించకపోవడంపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి.. అయితే, ఓ ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌.. ఆ ఆలయానికి ఈవోగా ఉన్న వ్యక్తితో ఫ్యాన్‌ తుడిపించారు.. ఈ ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది..

Read Also: RK Roja: జగన్‌ చరిత్ర తిరగరాస్తున్నారు.. వారి బాక్స్‌లు బద్దలు కావాలి..!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ద్రాక్షరామలో శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.. అయితే, ఆ సమయంలో ఆలయంలో అపరిశుభ్రతపై సీరియస్‌ అయ్యారు కలెక్టర్‌.. ఆలయంలో దుమ్ము పట్టి ఉన్న ఫ్యాన్‌ను స్వయంగా ఈవో ప్రసాద్‌తో తుడిపించారు కలెక్టర్.. ఫ్యాన్ బిగించిన తర్వాత ఇదే తొలిసారి శుభ్రం చేయడమా..? అంటూ ఈవోపై సెటైర్లు వేశారు కలెక్టర్ హిమాన్షు శుక్లా.. ఆలయ సిబ్బంది, అధికారుల ముందే ఈవోతో ఫ్యాన్‌ శుభ్రం చేయించారు.. ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా.