తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని లక్ష్మీపురం, కెనడీనగర్ కూడలి వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు. ప్రైవేటు బస్సులను ఆపి టీడీపీ నేతలు దాని బైఠాయించారు. ఎన్నికల సంఘం, పోలీసులు దొంగ ఓట్లు మీద ఏ మాత్రం దృష్టి సారించలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. మరో వైపు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని టీడీపీ నేతలు నేతలు అడ్డుకున్నారు. ఓ కళ్యాణ మండపంలో బయటి వ్యక్తులు బస చేశారన్న ప్రచారం నేపథ్యంలో తెదేపా నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. అలానే బస్సులు, కార్లు ఆపి నకిలీ ఓటర్లను టీడీపీ, కాంగ్రెస్ వర్గీయులు బలవంతంగా దించేశారు. వారి నుంచి నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరో పక్క చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం భీమవరంలో తెదేపా, వైకాపా ఏజెంట్ల మధ్య వివాదం నెలకొంది. ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఇరు వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో అరగంట సేపు పోలింగ్ నిలిచింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.
ఏపీలో దొంగ ఓట్ల కలకలం ?
