NTV Telugu Site icon

Fake Phonepay: నకిలీ ఫోన్ పే.. టెక్నాలజీ సాయంతో యువకుడి మోసాలు

Fake2

Fake2

కాదేదీ మోసానికి అనర్హం. బ్యాంకుల పేరు చెప్పి.. ఫోన్ కాల్స్ ద్వారా మోసం చేసేవారు ఒకరైతే ఓటీపీ నెంబర్లతో ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టేవారు మరికొందరు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలకు కూడా కేంద్రంగా మారుతోంది. కొంత మంది తెలివిగల వారు టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా నకిలీ ఫోన్ పే రంగంలోకి వచ్చింది. వస్తువు కొన్న తరువాత మీ అక్కౌంటులోకి డబ్బులు వచ్చినట్లే చూపిస్తాయి. కానీ డబ్బులు మాత్రం రావు..ఇది నకిలీ ఫోన్ పే వ్యవహారంలో జరుగుతున్న వ్యవహారం. రాష్ర్టాల సరిహద్దులో ఈ అక్రమాలు యథేచ్చగా సాగుతున్నాయి.

టెక్నాలజీ పెరగడంతో మంచి జరుగుతుందో లేదో తెలియదు కాని, అమాయకులు మాత్రం టెక్నాలజీని బాగా ఉపయోగించే వారి పట్ల మోసపోక తప్పడంలేదు.మార్కెట్ లోకి ఎన్నో రకాల యాప్స్ వచ్చాయి, అందులో మనకు రావాల్సిన డబ్బులు కోసం మనం ఇవ్వాల్సిన డబ్బులు కోసం నిత్యం మనకు గుర్తు చేయడానికి ఖాతా బుక్ అనే యాప్ కూడా ఉంది. ఆ యాప్ లో మనం ఏం నోట్ చేస్తే అది మనకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పంపిస్తూ ఉంటుంది, టెక్నాలజీపై అవగాహన పెంచుకున్న ఓ యువకుడు భారీ మోసాలకు పాల్పడ్డాడు. ఖాతా బుక్ నే నకిలీ ఫోన్ పే గా మార్చుకొని లక్షల రూపాయల డబ్బులు కొట్టేస్తూ దర్జాగా ఉన్నతాధికారుల దగ్గరే విధులు నిర్వహించేవాడు. ఉన్నతాధికారి వద్ద పని చేశాడు కాబట్టి అందరికి సుపరిచితుడే అయినందు వల్ల అతడు మోసాలు చేస్తాడని ఎవ్వరు ఊహించలేదు. అందువల్లనే పలువురిని ముంచేశాడు.

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన అల్లూరి అరవింద్ చేసిన మోసాల చిట్టా ఇది. గత కొన్ని రోజుల నుండి పెట్రోల్ బంక్ లోకి వెళ్లడం పెట్రోల్ పోయించుకోవడం బంక్ యజమాని ఫోన్ పే నెంబర్ చెప్పమనడం ఆ నెంబర్ ని ఫోన్ పే లో సెర్చ్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరున వస్తుందో తెలుస్తుంది, అలా బ్యాంకింగ్ నేమ్ తెలిస్తే వెంటనే ఖాతా బుక్ యాప్ లో ఆ పేరే యాడ్ చేసి ఎంత అమౌంట్ పెట్రోల్ పోసుకున్నామో అంత అమౌంట్ యాడ్ చేసి రిసివీడ్ అని మెసేజ్ ని టైప్ చేసి ఆ వ్యక్తికి పంపిస్తే రిసీవిడ్ అని వస్తుంది. అది కూడా ఫోన్ పే ద్వారా వచ్చినట్టు తెలుస్తోంది. దానిని పెట్రోల్ బంక్ లో చూపించి వెళ్ళిపోతాడు. అలా వందలసార్లు అరవింద్ చేసినప్పటికీ రెండు వందలు ఐదొందలే కాబట్టి విషయం అందరూ లైట్ తీసుకున్నారు.
పెట్రోల్ బంక్ యజమానులు అరవింద్ ఇంటికి వచ్చి గొడవ చేస్తే పరువు పోతుందని తల్లిదండ్రులు బంక్ యజమానులకు డబ్బులు చెల్లించారు.

అరవింద్ దానిని ఆసరాగా తీసుకుని భారీ మోసాలకు పాల్పడ్డాడు. వేరే షాపులైతే ఎంతో అమౌంట్ రాదు, అలానే ఏ వస్తువులు తీసుకున్నా కేవలం ఆ వస్తువులను ఉపయోగించటమే తప్ప అమ్ముకోవడం తాకట్టు పెట్టుకోవడం కుదరదు కాబట్టి మనోడు మాస్టర్ ప్లాన్ వేశాడు, రూరల్ ఏరియాలో ఉన్న గోల్డ్ షాప్ లకు వెళ్ళడం ఫ్రెండ్ పెళ్లికి వచ్చాం గిఫ్ట్ ఇవ్వడం కోసం అంటూ షాప్ యజమనితో మంచిగా మాట కలపడం చేసేవాడు. ఉంగరాలు, హ్యాండ్ చైన్స్..చూడడం అందులో ఓ రెండు ఉంగరాలను ఒక హ్యాండ్ చైన్ బిల్ వేయించడం ఆ బిల్ మొత్తం పెట్రోల్ బంక్ లో చేసినట్టుగానే ఫోన్ పే లో నెంబర్ సెర్చ్ కొట్టి నేమ్ ఏది వస్తే ఆ పేరును ఖాతా బుక్ లో యాడ్ చేసి సేమ్ అదే పేరుతో నకిలీ ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తాడు. యజమాని ఆ మెసేజ్ చూసి ఒకే అని ఆ బంగారు ఆభరణాలు ఇచ్చేసారు. ఎంతసేపటికి డబ్బులు అకౌంట్ లో జమ కాకపోవడంతో మోసపోయామని తర్వాత గ్రహిస్తారు.

అలా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు ఓ ఇరవై దుకాణాల్లో మనోడి బాధితులు ఉన్నారు. అశ్వారావు పేటకు సమీపంలో ఆంధ్ర ప్రదేశ్ ఉండడంతో అక్కడ కూడా భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డాడు.

* పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో గణేష్ జూవెలర్స్ వద్ద 68,000/-
* కృష్ణా జిల్లా గంపలాగూడెం లో వరలక్ష్మి జూవెలర్స్ వద్ద 42,000/-
* పశ్చిమగోదావరి జిల్లా కుకునూరులో దివి సాయి జూవెలర్స్ లో 48,000/-
* తాళ్లపూడి లో వెంకటరమణ జూవెలర్స్ లో 44,000/-
* తిరువురులో దుర్గ జూవెలర్స్ లో 60,000/-
* భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో 35,000/-
* అశ్వారావుపేట నియోజకవర్గ ములకలపల్లిలో 45,000/-
* అశ్వారావుపేట శీమకుర్తి జూవెల్లెర్స్ లో 1,25,000/- ఇలా మోసాలకు పాల్పడ్డాడు.

అయితే బాధితుల్లో ఒకరైన నల్లజర్లకు చెందిన గణేష్ జూవెలర్స్ యజమాని రామకృష్ణ కు అరవింద్ పై అనుమానం రావడంతో బంగారు ఆభరణాలు అరవింద్ ఇచ్చేటప్పుడు తన మొబైల్లో ఫొటో తీసుకున్నాడు, అలానే తన షాప్ లో ఉన్న సీసీ కెమెరాల్లో అరవింద్ రావడం షాప్ లో ఉన్నంతసేపు రికార్డ్ అయ్యాయి. మోసపోయామని గ్రహించిన రామకృష్ణ అరవింద్ ఫోటోపై నకిలీ ఫోన్ పే ద్వారా మమ్మల్ని మోసం చేశాడు. ఈ వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే మాకు తెలియచేయగలరు అంటూ గ్రూపుల్లో పెట్టడంతో మనోడి బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.

అల్లూరి అరవింద్ అశ్వారావుపేట మండలం వినాయకపురంలో అశ్వారావుపేటలో బంక్ ల్లో రెస్టారెంట్ ల్లో పలు దుకాణాల్లో ఇదే పని చేశాడని గుర్తించారు. అయితే అప్పట్లో అరవింద్ దమ్మపేట పోలీస్ స్టేషన్ లోఎస్‌ఐకి డ్రైవర్ గా ఉండేవాడు. అందుకే ఎవరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. డబ్బులు కూడా తక్కువే కాబట్టి అందరూ చూసి చూడకుండా వదిలేశారు. పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నామని చెప్పుకుంటూ పోలీస్ పేరును కూడా బదనాం చేశాడనే చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అల్లూరి అరవింద్ పై గోల్డ్ షాప్ యజమానులు ఫిర్యాదు చేశారు. అరవింద్ ఆగడాలకు పోలీసులు ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి.

Auto Driver Harassment: బాలికకు ఆటోడ్రైవర్ వేధింపులు

Show comments