Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Fact Check On Grain Purchases In Andhra Pradesh

Fact Check: ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయని ప్రచారం.. ఖండించిన ఏపీ పౌరసరఫరాల శాఖ

Published Date :January 18, 2023 , 7:51 pm
By newsdesk
Fact Check: ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయని ప్రచారం.. ఖండించిన ఏపీ పౌరసరఫరాల శాఖ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మిగిలిన సేకరణ కూడా జరగాలని సీఎం జగన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వ్యవసాయశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎక్కడా నష్టంలేకుండా చూడాలని సూచించారు. ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. రైతులకు మిల్లర్లతో పని ఉండకూడదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద విక్రయంతోనే రైతుల పని ముగుస్తుంది, ఆతర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని గుర్తు చేశారు.

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
రబీలో కూడా రైతులకు విత్తనాల పరంగాగాని, ఎరువుల పరంగాగాని ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలున్నా, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నా ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే స్పందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. చంద్రబాబు హయాంలో ఏడాదికి ధాన్యం కొనుగోలు సేకరణకు సుమారు రూ.8వేల కోట్లు అయితే మన ప్రభుత్వం హయాంలో ఏకంగా రూ.15వేల కోట్లు సగటున ఏడాదికి ధాన్యం సేకరణకు పెడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా రైతులకు అనుకున్న సమయానికే చెల్లింపులు జరుగుతున్నాయన్నారు.

ఏప్రిల్‌లో శాయిల్ టెస్టింగ్ తప్పనిసరి
శాయిల్‌ టెస్టింగ్‌ ప్రతి ఏటా కూడా ఏప్రిల్‌ మాసంలో జరిగేలా చూసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. టెస్టు అయిన తర్వాత సర్టిఫికెట్లను రైతులకు ఇవ్వాలని తెలిపారు. ఫలితాలు ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులకు మార్గనిర్దేశం చేయాలని సీఎం ఆదేశించారు. తద్వారా ఆ పంటకు అవసరమైన పోషకాలను సూచించాలన్నారు. భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలో కూడా శాయిల్‌ టెస్ట్‌ పరికరాలు ఉంచాలని.. దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలను కూడా రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి గ్రామంలో శాయిల్‌ టెస్టింగ్‌ తర్వాత మ్యాపింగ్‌ జరగాలని సూచించారు. దీనివల్ల ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాలమేరకే జరుగుతుందని, రైతులకు పెట్టబడులు ఆదా అవడంతో పాటు, కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు. అదేవిధంగా, మాండస్‌ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణపై అధికారులు సీఎంకు అందించిన వివరాలు
2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. 2019–20 నుంచి 2022–23 ఖరీప్‌ వరకూ సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్‌ టన్నులు జరిగిందని అధికారులు సీఎంకు నివేదించారు. రబీకి సంబంధించి ఇ– క్రాప్‌ బుకింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించిన అధికారులు. మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామని తెలిపారు.

డ్రోన్ల పంపిణీకి అధికారుల కసరత్తులు
ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, కిసాన్‌ డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ పరికరాల పంపిణీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ఏడాది మార్చి, మే–జూన్‌ నెలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు. 2వేల డ్రోన్లను పంపిణీ చేసేదిశగా కార్యాచరణ చేశామన్నారు. అందులో భాగంగా తొలివిడతగా రైతులకు 500 ఇస్తామని తెలిపారు. గత డిసెంబరు నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని.. శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ యూనివర్శిటీ ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
సీఎం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలమేరకు ఇప్పటికే రైతులకు ధాన్యం సేకరణపై 89 శాతం చెల్లింపులు జరిగాయని అధికారులు వెల్లడించారు. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం రైతుల్లో సంతోషాన్ని నింపిందన్నారు. ఇప్పటివరకూ రూ. 5,373 కోట్లు విలువైన ధాన్యాన్ని సేకరించామన్న అధికారులు.. ఇంకా సేకరణ కొనసాగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండోవారం వరకూ సేకరణ కొనసాగుతుందని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగంపై కార్యాచరణ రూపొందించామని అధికారులు సీఎంకు నివేదించారు.

మరోవైపు, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసినట్లు ఈనాడులో ప్రచురించిన కథనాన్ని ప్రభుత్వం ఖండించింది. ఈనాడు దినపత్రికలో 18-01-2023న ‘ధాన్యం కొనుగోలు నిలిపివేత’ అను శీర్షికన వార్త ప్రచురించారు. రైతుల వద్ద ఇంకా నిల్వలు.. ఎదురు చూపులు, బ్యాంకు గ్యారంటీలు లేక కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు, రంగు మారిన ధాన్యం సేకరణకూ మొండి చెయ్యి అంటూ అవాస్తవాలను ప్రచురించారని పౌర సరఫరాల శాఖ ఎద్దేవా చేసింది. ధాన్యం సేకరణకు సంబంధించిన పౌర సరఫరాల శాఖ తెలిపిన వాస్తవాలు ఇలా ఉన్నాయి.

ధాన్యం కొనుగోలు నిలిపివేత పూర్తిగా అవాస్తవం
ధాన్యం కొనుగోళ్లు ఏ జిల్లాలోనూ నిలిపివేయలేదు. ప్రతిజిల్లా లోని రైతు భరోసా కేంద్రం పరిధిలో ధాన్యం సేకరణ కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఏ రైతు వద్ద ధాన్యము నిల్వ లేదని నిర్దారించుకొన్న తర్వాతనే ధాన్యం సేకరణ ప్రక్రియను అక్కడ ముగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిజ నిర్ధారణ(ఫ్యాక్ట్ చెక్) ద్వారా తెలియజేసింది.

1

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agriculture department
  • Andhra Pradesh
  • CM Jagan Mohan Reddy
  • fact check
  • Grain purchases

తాజావార్తలు

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions