Site icon NTV Telugu

Fact Check: అలాంటి ప్రచారం చేస్తే కఠినచర్యలు

Ap2

Ap2

2022 ఏడాదికిగాను జగనన్న అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందులు కారణంగా రద్దు చేయడం జరుగుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ అన్నది అసలు మనుగడలోనే లేదు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేవిధంగా దుష్ర్పచారం చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించం, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర అనే రెండు సంక్షేమ పథకాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రద్దు చేయడం జరిగిందనే ప్రచారం వాస్తవంకాదని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫిషియో సెక్రెటరీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అసలు మనుగడలోనే లేని సమాచార, సాంకేతిక, ప్రసారాల శాఖ అనే తప్పుడు పేరుతో ఇలాంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం. దీని వెనుక ఎంతటివారున్నప్పటికి ఉపేక్షించేది లేదని, ఇటువంటి ఫేక్ వార్తలను, పుకార్లను పుట్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

సంక్షేమ క్యాలెండర్ ను ముందుగానే ప్రకటించి మరీ ఏ నెలకు ఆ నెల సంక్షేమ పథకాల లబ్ధిని డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లో జమజేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను ప్రజలెవరూ నమ్మొద్దని విజ్జప్తి చేశారు. కరోనా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమ పథకాల అమలు జరిగిందని, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఏ సంక్షేమ పథకం ఆగదని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున ఆ ప్రకటనలో తెలిపారు.

Twitter War: అయ్యన్న తూటాలు.. విజయసాయి కౌంటర్లు

Exit mobile version