Site icon NTV Telugu

Facial attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. ఏపీ సర్కార్లో ఫేస్ రికగ్నిషన్ యాప్‌

Ap

Ap

Facial attendance: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పని తీరును మరింత పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ ఆధారిత మొబైల్ యాప్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఇకపై ఈ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యాలయ సమయాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆలస్యం, గైర్హాజరు లాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

Read Also: Astrology: జనవరి 17, శనివారం దినఫలాలు..

ఇక, ప్రస్తుతం రీ-సర్వే కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మాత్రం ఈ అటెండెన్స్ యాప్ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఫీల్డ్‌లో పని చేస్తున్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, ఇటీవల కొంతమంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆఫీసుల్లో అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చాయి. ప్రజలకు సక్రమంగా సేవలు అందడం లేదని, కార్యాలయాల్లో ఉద్యోగులు కనిపించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి అని సర్కార్ సీరియస్‌గా తీసుకుంది.

Read Also: Off The Record: పశ్చిమ గోదావరిలో వైసీపీకి షాక్..!

కాగా, ప్రజలకు నేరుగా సేవలు అందించే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉద్యోగుల పని తీరును మెరుగుపరచడం, జవాబుదారీతనం పెంచడం లక్ష్యంగా ఈ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, ఈ కొత్త విధానం అమలుతో గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Exit mobile version