తన అరెస్టుకు యత్నించిన ఎమ్మెల్యే, పోలీసులపై మాజీ మంత్రి అఖిల ప్రియ మండిపడ్డారు. బుధవారం భాగ్యనగరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఆమె అరెస్టుకు యత్నంచారు. ఈ సంఘటనపై అఖిల ప్రియ ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, పోలీసులు తీరుపై ధ్వజమెత్తారు.
Also Read: Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ అరెస్టుకు యత్నం
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్యేగా నువ్వు అన్ఫిట్. నీచమైన ఆలోచనతో నన్ను నడిరోడ్డు మీద పోలీసుతో అరెస్టు చేయించాలని చూస్తావా? నా కార్ డోర్ ఓపెన్ చేసి బయటికి లాగే పరిస్థితికి పోలీసులు దిగజారారు. ఎమ్మెల్యే.. మమ్మల్ని చూస్తే భయం పట్టుకుంటే ఇంట్లో కూర్చో, పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను అడ్డుపెట్టుకొని నన్ను ఆపాలని చూస్తావా?. ఎమ్మెల్యే ఆడవాళ్ళ ఉసురు తగిలితే అంత ఈజీగా పోదు. ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ఈరోజు ఎమ్మెల్యే ఈ ఊరు ఎట్లా తిరుగుతాడో చూస్తా. అన్నింటికీ తెగించి ఈరోజు నేను రాజకీయాల్లోకి దిగాను. ఎమ్మెల్యే మొఖం చూసి ఇక్కడ ఎవరు ఓట్లేయలేదు.
Also Read: Karanam Dharmasri: వచ్చే ఎన్నికల్లో సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తా..
పాపం అని జగన్ మొఖం చూసి ఓట్లు వేశారు. ఎమ్మెల్యే పెట్టుకున్న ప్రతి షెడ్యూల్ ఇకపై నాదే. ఎమ్మెల్యే ఏ ఊరికి వెళితే.. నేను అదే ఊరికి వెళ్తా. ఎలా అడ్డుకుంటారో చూస్తా. ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతి సెకను నేను అడ్డుపడతా. మీరు చేసేది ఫ్యాక్షన్ కాదు.. రౌడీయిజం, గుండాయిజం. ఎమ్మెల్యేగా ఉండి కూడా నీ ఇంట్లో నువ్వు అవినీతిని ఆపలేకపోతున్నావు. తండ్రిని పక్కన పెట్టుకొని అవినీతి కార్యక్రమాలు చేస్తున్నావు. మీ నాన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నువ్వు అడ్డుపడుతున్నావు, మళ్లీ నువ్వు ఒక రాజకీయ నాయకుడివి..!’ అంటూ ఆమె మండిపడ్డారు.