Site icon NTV Telugu

తప్పును ప్రశ్నించే హక్కు అందరికి ఉంది: చంద్రబాబు నాయుడు

ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ అనంతరం మీడియాతో మాట్లాడారు.రాజ్యాంగం ఇంకా బతికే ఉంది.. తప్పును ప్రశ్నించే హక్కు అందరికి ఉందన్నారు.చట్ట సభలకు దివ్యాంగులను పంపే బాధ్యత నేను తీసుకుంటా.దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లక్షల మందికి సాయం చేశాం. విభిన్న ప్రతిభావంతులకు రూ. 500 ఉండే పెన్షన్‌ను రూ. 3 వేలు చేశామని ఆయన చెప్పారు.

ఎప్పుడో ఎన్టీఆర్ కట్టిన ఇంటికి ఇప్పుడు జగన్ పట్టా ఇస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత కమిషన్ వేస్తామని తెలిపారు. ఇప్పుడు తప్పు చేసిన వారిపై అప్పుడు చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. జగన్‌ ప్రభుత్వం ప్రజలను రాక్షస జాతిలా ప్రజలను పీల్చుకు తింటుందని ఆరోపించారు. ప్రజలను నవరత్నాలని నమ్మించి ఇప్పుడు నవగ్రహాల చూట్టూ తిరిగేలా చేస్తున్నారని విమర్శించారు. దివ్యాంగుడైన కోటేశ్వరరావు ఎన్టీఆర్‌కు నాకు పైలైట్‌గా ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

Exit mobile version