దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అటు ఏపీలోనూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. బుధవారం 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను తక్షణమే పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారుల బృందంతో దీన్ని ఏర్పాటు చేసింది.
Read Also: గృహ హింస కేసులో కన్నా కోడలికి రూ.కోటి పరిహారం
కోవిడ్ నిబంధనల అమలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, ఆక్సిజన్ సరఫరా, హోం ఐసోలేషన్ కిట్లు, ఫీవర్ సర్వే, అత్యవసర మందుల సరఫరా తదితర అంశాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు, ల్యాబ్ మేనేజ్‌మెంట్, మొబైల్ మెడికల్ యూనిట్లు, అంబులెన్సుల పర్యవేక్షణను కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షించనుంది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో పాజిటివ్ కేసులు పెరగకుండా రోజూ కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సమర్ధవంతమైన చర్యలు చేపట్టనుంది.
