పేదరిక నిర్మూలన దిశగా కృషి చేసినందుకు ఆర్థికశాస్త్రంలో ఎస్తేర్ డఫ్లో నోబెల్ పురస్కారం అందుకున్నారు. ఇంతకు ముందు అమర్త్య సేన్‌కు కూడా పేదరిక నిర్మూలన దిశగా పనిచేసినందుకు నోబెల్ అందుకున్నారు. ఎస్తేర్ డప్లో బృందం నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమై ఆర్ధిక రంగ అంశాల పై ఎస్తేర్ డప్లో చర్చించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారులతో భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్ధిక, విద్య, వైద్య శాఖ తదితర పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Esther Duflo : నోబెల్ అవార్డు గ్రహీతతో జగన్ భేటీ..
