NTV Telugu Site icon

సీఎం జగన్‌తో ఎస్సార్‌ గ్రూప్‌ ప్రతినిధుల భేటీ.. ఏపీలో భారీ పెట్టుబడులు..!

Essar Group

Essar Group

క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులు.. సీఎంను కలిసిన వారిలో ఎస్సార్ గ్రూప్ హెడ్‌‌ ప్రశాంత్ రుయా, వైస్ ఛైర్మన్ జె మెహ్రా, ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఉన్నారు… ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూపు సన్నద్దత వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది.. వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్సార్ గ్రూపు.. ఈ ఏడాది నవంబర్‌లో స్టీల్ ప్లాంట్ పనులుకు శంకుస్ధాపన చేసేందుకు సిద్ధమవుతోంది.