Site icon NTV Telugu

AP Crime: వారణాసిలో ఏపీకి చెందిన అన్నదమ్ముల ఆత్మహత్య..

Varanasi

Varanasi

AP Crime: అన్నదమ్ములు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది.. జిల్లాలోని ఉంగుటూరు మండలం నారాయణపురం చెందిన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు.. ఏప్రిల్ నెలలో ఇంటి వెళ్లిపోయారు అన్నదమ్ములు లక్ష్మీనారాయణ (34), వినోద్ (32).. అయితే, కొన్ని రోజుల బంధువులు, స్నేహితులు, తెలిసినవారి ఇళ్లలో వెతికారు బంధువులు.. ఆ తర్వాత బంధువుల ఫిర్యాదుతో మే నెలలో చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.. అయితే, రియల్ ఎస్టేట్,  ఫైనాన్స్ వ్యాపారం చేసే అన్నదమ్ములు ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో కొన్ని అనుమానాలు మొదలయ్యాయి.. కానీ, వారణాసిలోని ఆంధ్ర ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకుని.. అందులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు లక్ష్మీనారాయణ, వినోద్.. మృతుల సెల్ ఫోన్ లో మొబైల్ నెంబర్ల ఆధారంగా నారాయణపురంలో బంధువులకు సమాచారం ఇచ్చిన వారణాసి పోలీసులు.. ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు బెదిరిస్తున్నారని.. దాంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలు పంపారు అన్నదమ్ములు.. ఇక, పోలీసుల నుంచి సమాచారం రావడంతో.. మృతదేహాల కోసం వారణాసి వెళ్లారు బంధువులు..

Read Also: Arikepudi Gandhi: గాంధీ పేరు పక్కన పెట్టి నీ సంగతి చూస్తా.. కౌశిక్‌ రెడ్డికి అరికెపూడి వార్నింగ్‌..

Exit mobile version