Site icon NTV Telugu

Mango Bay Resorts Club: మ్యాంగో బే రిసార్ట్స్ క్లబ్లో జోరుగా పేకాట.. పట్టుబడ్డ బడా బాబులు

Elr

Elr

Mango Bay Resorts Club: ఏలూరు జిల్లాలో మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ లో పోలీసుల సోదాల్లో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. తమకు అనుమతి ఉందని మ్యాంగ్ క్లబ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు గుర్తించారు. మ్యాంగో క్లబ్ కు అనుమతి ఉందని తమకు కూడా అనుమతి ఇవ్వాలని ఏలూరు పోలీసులపై భీమవరం, నరసాపురం, ఏలూరు, జంగారెడ్డి గూడెం క్లబ్స్ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. తాము ఎవరికి అనుమతి ఇవ్వలేదని ఏలూరు జిల్లా పోలీసులు పేర్కొన్నారు.

Read Also: Modi-New Zealand: న్యూజిలాండ్ ప్రధానితో మోడీ సంభాషణ.. కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

అయితే, రాష్ట్రవ్యాప్తంగా క్లబ్ లకు అనుమతి ఇవ్వాలంటూ మ్యాంగో బే రిసార్ట్ పేకాట క్లబ్ వ్యవహారం పోలీసుల దృష్టికి వేరే క్లబ్స్ తీసుకు రావటంతో ఈ క్లబ్ పై దృష్టి పెట్టారు. అదే సమయంలో మ్యాంగో క్లబ్ పై మెరుపు దాడులు చేశారు. తమకు కోర్టు ఆదేశాలతో కూడిన అనుమతి ఉందని నిర్వహకులు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.

Exit mobile version