Site icon NTV Telugu

Polavaram Project: పోలవరంలో మూడో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన

Polavaram

Polavaram

Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం.. మరోసారి ప్రాజెక్టు వద్ద లోతుగా అధ్యయనం చేస్తోంది.. అందులో భాగంగా నేడు పోలవరంలో మూడవ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగనుంది.. ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి చర్చించనున్నారు.. డయా ఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాములు సమాంతరంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందా..? లేదా..? అనే విషయంపై అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో చర్చించనుంది నిపుణుల బృందం.. ప్రాజెక్టు అధికారులు, కేంద్ర జల సంఘం చైర్మన్ తో విడివిడిగా సమావేశం కానున్నారు..

Read Also: OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు!

అయితే, రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం రోజు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించి చర్చించింది నిపుణుల బృందం.. వీలైనంత వేగంగా డ్యాం ఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని సూచించింది.. మరోవైపు.. నేడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులపై ఫోకస్‌ పెట్టనున్నారు.. డయా ఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాములు సమాంతరంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందా..? లేదా..? అనే విషయంపై ఇరిగేషన్‌ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో చర్చించనుంది నిపుణుల బృందం.. ప్రాజెక్టు అధికారులు, కేంద్ర జల సంఘం చైర్మన్ తో విడివిడిగా సమావేశమై.. దీనిపై చర్చించనున్నారు.. ఇక, రేపు నాణ్యత నియంత్రణ అంశాలపై అధికారులతో చర్చించనుంది విదేశీ బృందం..

Exit mobile version