NTV Telugu Site icon

Eluru Call Money Case: ఏలూరు కాల్ మనీ కేసు.. ప్రధాన నిందితుడి అరెస్ట్

Eluru

Eluru

Eluru Call Money Case: ఏలూరులో కాల్ మనీ దందాలు సంచలనంగా మారాయి.. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఏలూరులో కాల్ మనీ వేధింపులకు పాల్పడి ప్రధాన నిందితుడు మేడపాటి సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.. మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేసి అధిక వడ్డీల వ్యాపారం చేస్తున్న మేడపాటి సుధాకర్ రెడ్డితో పాటు అల్లాడ లావణ్య, వీరమల్ల రాజేష్ లను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.. అధిక వడ్డీల వ్యాపారం చేస్తున్న వారందరికీ జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిషోర్‌ ఈ సందర్భంగా వార్నింగ్‌ ఇచ్చారు.. అధిక వడ్డీలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.. ఉద్యోగులు అధిక వడ్డీల వ్యాపారంలో భాగస్వాములుగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.. అధిక వడ్డీలపై బాధితులు ఎలాంటి భయం లేకుండా ఫిర్యాదు చేయవచ్చు అని పిలుపునిచ్చారు ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిషోర్..

Read Also: Revanth Reddy: ఎవరు అడ్డు వచ్చిన అక్రమార్కుల సంగతి ఖచ్చితంగా తేల్చుడే..

కాగా, గతంలోనూ విజయవాడ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాల్ మనీ కేసులు వెలుగు చూశాయి.. ఈ కేసుల్లో విస్తుపోయె నిజాలు బయటకు వచ్చాయి.. బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని.. అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వడం.. తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉంటే.. వారిని తీవ్రంగా వేధించడం.. మానసికంగా.. శారీరకంగా.. చివరకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంటే.. తమ కోరిక తీర్చాలని.. తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలని.. ఇలా రకరాల విస్తుపోయే విషయాలు వెలుగుచూసిన విషయం విదితమే..

Show comments