Site icon NTV Telugu

Physical Harassment Case: క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. కోచ్‌ అరెస్ట్, 14 రోజుల రిమాండ్

Arrested

Arrested

Physical Harassment Case: స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారిణులను లైంగిక వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ వినాయక ప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు ఏలూరు పోలీసులు.. కొద్దిరోజుల క్రితం కోచ్ వినాయక ప్రసాద్ పై ఫిర్యాదు చేశారు వెయిలిఫ్టింగ్ క్రీడాకారిణులు.. బాలికల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన బెంగుళూరు నుంచి వచ్చిన శాయ్‌ సభ్యులు.. లైంగిక వేధింపులు నిజమేనని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఇక, పోక్సోకేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడు వినాయక ప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు.. మరోవైపు, స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారిణులను లైంగిక వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ వినాయక ప్రసాద్‌ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. బాలికలపై లైంగిక వేధింపులు నిజమేనని తేలడంతో మొదట పోలీసులకు ఫిర్యాదు చేశారు S.A.I సభ్యులు.. దీంతో, పోక్సో కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు.. నిందితుడు వినాయక ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు..

Read Also: Thaman : అడ్రస్ పెట్టురా వచ్చి నేర్చుకుంటా.. థమన్ ఫైర్..!

Exit mobile version