Budameru Floods: బుడమేరుకు గండ్లు పడడంతో.. విజయవాడను ముంచెత్తింది.. ఇప్పుడు గండ్లను పూడ్చే పనిలో ఏపీ ప్రభుత్వం నిమగ్నం కాగా.. క్రమంగా వరద కొల్లేరులోకి వెళ్లింది.. దీంతో.. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో టెన్షన్ మొదలైంది.. బుడమేరు కొల్లేరులోకి ప్రవహించడంతో చుట్టు పక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఏలూరు నుండి కైకలూరు వచ్చే రహదారి మీదగా నీరు ప్రవహించడంతో ముందస్తుగా వాహనాలను నిలిపివేశారు పోలీసులు.. ఈ రాత్రికి కొల్లేరు వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే కొన్ని గ్రామాలు నీట మునిగాయి.. కొల్లేరులోకి వరద రెండు అడుగుల మేర పెరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు.. బుడమేరు కొల్లేరులోకి ప్రవహించడంతో కొల్లేరు ప్రజలతో పాటు చేపల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. కొల్లేరుకి వరద పెరుగుతుండడంతో కొన్ని గ్రామాలకు వెళ్లే రహదారులు నీట మునిగాయా.. దీంతో.. ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. పినుమాకులంక, నందిగామ లంక, ఇంగిలి పాక లంక , మణుగూరు. కోమటి లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
మరోవైపు.. బుడమేరుకు వరద పెరగటంతో వేల ఎకరాల్లో ఉన్న చెరువులకు ముంపు వాటిల్లే అవకాశం ఉంది అంటున్నారు.. వరద పెరిగితే 10 వేల ఎకరాల్లో చెరువులు నీట మునుగుతాయనే భయంతో వ్యాపారుల ఆందోళన నెలకొంది.. ఇప్పటికే పెనుమాక లంక, నందిగామ లంక, ఇండ్లు పాడు లంక, మనుగులూరు లంకకి రవాణా సంబంధాలు తెగిపోయాయి.. వరద ముంపు భయంతో చెరువుల చుట్టూ వలలు కట్టేందుకు నిర్వాహకులు సిద్ధం అవుతున్నారు.. ఇక, కొల్లేరులో నీటి మట్టం పెరుగుతోంది. కొల్లేరు సరస్సు అంతర్భాగంలో మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉండగా.. తమ్మిలేరు, రామిలేరు, బుడమేరు వాగులతోపాటు కృష్ణ కాలువల్లో భారీ వరద కొల్లేరుకు చేరుతోంది. ఈ నీరంతా నేరుగా ఉప్పుటేరులో కలుస్తుంది. భారీ వరదలతో లంక గ్రామాల చుట్టూ ఇప్పటికే పూర్తిగా నీరు చేరింది. కొన్ని లంకలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్నింటికి ప్రమాదం పొంచి ఉంది.