Student Attacks Professor: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థి తన విభాగ ప్రొఫెసర్ పై కత్తితో దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, సక్రమంగా క్లాసులకు హాజరుకాని విద్యార్థిని ల్యాబ్ ఎగ్జామ్ రాయడానికి ప్రొఫెసర్ అనుమతించలేదు.. దీనిపై ఆగ్రహించిన సదరు విద్యార్థి, విభాగ ఇన్‌చార్జ్ ప్రొఫెసర్ గోపాలరాజుపై కత్తితో దాడి చేశాడు.
Read Also: Haryana: ఫరీదాబాద్‌లో ఘోరం.. ఏసీ పేలి ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు కుక్క మృతి
ఇక, ఈ ఘటనలో గాయపడిన ప్రొఫెసర్ గోపాలరాజును నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలరాజు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ప్రవర్తనపై ఇతర అధ్యాపకులు, స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
