ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కార్పోరేషన్‌కు సంబందించి కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 47 డివిజన్లకు గాను మూడు డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన మూడు డివిజన్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 20 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 18 చోట్ల వైసీపీ విజయం సాధించగా, రెండు చోట్ల టీడీపి విజయం సాధించింది. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో 40కి పైగా డివిజన్లు కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాయోగ్యమైన పథకాలే విజయానికి కారణం అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
Read: “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేసిన అలియా