Site icon NTV Telugu

ఏపీలో ఇవాళ 69 పంచాయతీల్లో ఎన్నికలు

ఏపీలో ఇవాళ 69 పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా.. కేసుల కారణంగా కొన్ని చోట్ల.. అభ్యర్థుల మరణంతో మరికొన్ని చోట్ల.. గొడవలు జరిగి ఇంకొన్ని చోట్ల… ఎన్నికలు నిలిచిపోయాయి. వీటిన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ 69 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి… పోలింగ్‌ ముగిశాక ఓట్లు లెక్కపెట్టి విజేతను ప్రకటిస్తారు. ఇక రేపు నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాల్టీలు ఉన్నాయి. ఎల్లుండి 15 ZPTC, 187 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. కార్పొరేషన్‌, మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు 17న… ZPTC, MPTC ఓట్ల లెక్కింపు 18న ఉంటాయి.

Exit mobile version