NTV Telugu Site icon

Election commission: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం ఈసీ ప్రకటన

Ec

Ec

Election commission: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. అక్టోబరు 1వ తేదీ నాటికి ఓటర్లుగా అర్హులయ్యే వారి పేర్లను జాబితాలో చేర్చేలా సవరణ ప్రక్రియ చేపట్టనున్న ఈసీ.. 2025 జనవరి 1వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటన కోసం ప్రక్రియను ప్రారంభించేలా ప్రకటన విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో సవరణలు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను ఆగస్టు 20వ తేదీ నుంచి ఈసీ ప్రారంభించనుంది. ఇక, అక్టోబరు 28వ తేదీ వరకూ ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది.

Read Also: North Korea: విదేశీ టూరిస్టులకు శుభవార్త చెప్పిన నియంత కిమ్..

అలాగే, అక్టోబరు 29వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 2024 నవంబరు 28వ తేదీ వరకూ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనుంది. 2025 జనవరి 6వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది. అభ్యంతరాల స్వీకరణ కోసం 2024 నవంబర్ 9, 10, 23-24 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు.