Site icon NTV Telugu

హెల్త్ యూనివర్సిటీ నిధుల జోలికి ప్రభుత్వం పోదు: ఆదిమూలపు సురేష్‌


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంశంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నిధులు మాయమయ్యాయని చేస్తున్న ఆందోళనపై ఆయన మాట్లాడారు. హెల్త్ యూనివర్సిటీ అంశం నా పరిధిలో లేదు. హెల్త్ యూనివర్సిటీ నిధుల జోలికి ప్రభుత్వం పోదన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఆర్జేయూకేటీ యూనివర్సిటీ నుంచి150 కోట్ల రూపాయలను ఎన్నికల సమయంలోపసుపు కుంకుమ కింద మళ్లించిందని ఆయన ఆరోపించారు. ఆ లోటు నుంచి ఇప్పటికీ ఆర్జేయూకేటీ యూనివర్సిటీ కోలుకోలేదన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రశ్నించలేకే టీడీపీ నేతలకు కడుపు మంటగా ఉందన్నారు.బీజేపీ, జనసేన, టీడీపీ కుమ్మక్కై వైసీపీ ప్రభుత్వం పై ముప్పేట దాడి చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. అచ్చెన్నాయుడుకు తన పార్టీ పైనే తనకే గౌరవం లేదని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజా తీర్పులో ఎలాంటి మార్పు ఉండబోదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

Exit mobile version