ED Arrested YCP MP Son Magunta Raghava Reddy In Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో భాగంగా తాజాగా ఈడీ అధికారుల మరొకరిని అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సౌత్ గ్రూప్ ప్రస్తావనలో రాఘవ పేరు వచ్చిన నేపథ్యంలో.. ఈడీ అతడ్ని అరెస్ట్ చేసినట్లు తేలింది. రాఘవను ఈడీ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నారు. రాఘవ అరెస్ట్‌తో ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఈడీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
Qamar Javed Bajwa: ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా కొనసాగితే, పాకిస్తానే ఉండేది కాదు
ఈ స్కామ్‌లో భాగంగా.. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు విజయ్ నాయర్ ఖాతాలోకి వెళ్లాయని, ఆయన ఆ డబ్బులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందజేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. ఆ సంస్థలో ఉన్న శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని, ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌తో ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే.. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని పలు సందర్భాల్లో మాగుంట శ్రీనివాసులు వెల్లడించారు. మరోవైపు.. ఈ కేసులో ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో.. ఇవాళ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో బుచ్చిబాబును సీబీఐ ప్రవేశపెట్టనుంది.
Rohit Sharma: వాడు కొంచెం పిచ్చోడు, స్మిత్‌పై రోహిత్ వ్యాఖ్యలు.. వీడియో వైరల్
కాగా.. ఇప్పటికే సౌత్ గ్రూప్ నుంచి పలువుర్ని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు, మంగళవారం గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం కొన్ని గంటల్లోనే గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో ఉన్న బ్రికాంక్ కో అనే సేల్స్ ఆర్గనైజేషన్‌కి ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు. ఢిల్లీ ఆప్ నేతలతో మల్హోత్రాకు పరిచయాలు ఉన్నాయని, వారి అండతోనే ఈ లిక్కర్ బిజినెస్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అనంతరం గురువారం చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంపాదించిన డబ్బులను.. గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం అతడు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.