Rohit Sharma: వాడు కొంచెం పిచ్చోడు, స్మిత్‌పై రోహిత్ వ్యాఖ్యలు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను ఉద్దేశించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండో పరుగుకు ప్రయత్నించిన రవీంద్ర జడేజాతో రోహిత్ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. లబుషేన్ వేసిన 76వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో జడేజా స్లిప్‌లోకి బంతిని ఆడి క్విక్ సింగిల్ తీశాడు. బంతిని స్మిత్ నిదానంగా అందుకోవడం చూసిన జడేజా రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ.. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం.. ‘ఓ థోడా పాగల్ హై. సచ్ మే’ (వాడికి కొంచెం పిచ్చి) అంటూ స్మిత్‌ను ఉద్దేశించి.. రెండో రన్ కోసం రావద్దంటూ జడేజాను వారించాడు. బాల్‌ను నిదానంగా తీసుకుంటున్నట్లు నటించి, వేగంగా త్రో వేయడం కోసం స్మిత్ వేసిన ప్లాన్ అని.. ఇలాంటి పిచ్చి వేశాలు అతని దగ్గర చాలా ఉన్నాయనే ఉద్దేశంతో రోహిత్ అలా అన్నట్లు క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రోహిత్ అన్న మాటల స్టంప్స్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
— Aditya Kukalyekar (@adikukalyekar) February 10, 2023
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(120) సెంచరీతో చెలరేగగా.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(66 బ్యాటింగ్), అక్షర్ పటేల్(52 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 114 ఓవర్లలో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మర్ఫీ(5/82) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. నాథన్ లియోన్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం భారత్ 144 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మరో 50 పరుగుల ఆధిక్యం అందుకుంటే దాదాపు ఈ మ్యాచ్ భారత్ వశమైనట్లే.
Also Read: Smart Phone market: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఢీలా..27 శాతం తగ్గుదల
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!