Somu Veerraju: ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయాలంటూ తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పిలుపునిచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఇదే సమయంలో ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేయొద్దని సూచించారు.. ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే.. ఆర్ఎస్ఎస్ భావజాలాన్నీ అంగీకరించినట్టే.. అది చాలా ప్రమాదమని హెచ్చరించారు.. ఇక, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విషయం సాధించిన విషయం విదితమే కాగా.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉండవల్లితో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ సవాల్ చేశారు..
Read Also: Pooja Hegde : హీరోయిన్ గా పూజా హెగ్డేకి సినిమా దొరికిందోచ్!
ఆర్ఎస్ఎస్ పై ఉండవల్లి నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదు అని సూచించారు వీర్రాజు.. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో ఉండవల్లితో ఎప్పుడైనా బహిరంగ చేర్చుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు.. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గెలుపులో క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది అని గుర్తుచేశారు.. దేశభక్తుడైన రాధాకృష్ణన్ కు ఓటు వేయొద్దని ఉండవల్లి అన్నారు.. సామాన్యులను చంపుతున్న నక్సలైట్లకు మద్దతు ఇచ్చిన వారికి ఓటు వేయమని సెలవిచ్చారు అని దుయ్యబట్టారు.. ఆర్ఎస్ఎస్ ఒక ఫాసిస్టు సంస్థని ఉండవల్లి అన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాకు ఓట్లేసినందుకు వైఎస్ జగన్ ని షర్మిల విమర్శిస్తుంది.. ఆమెకి ఆస్తిలో వాటా ఇస్తే జగన్ వెనకాలే షర్మిల ఉండేది అని సెటైర్లు వేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..
