NTV Telugu Site icon

Sisters Kidnapping Case: అక్కాచెల్లెళ్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

Rajahmundry

Rajahmundry

Sisters Kidnapping Case: రాజమండ్రిలో సంచలనం కలిగించిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు.. కిడ్నాపర్ మారోజు వెంకటేష్ పోలీసులకు చిక్కాడు. కిడ్నాప్ కు గురైన అక్కాచెల్లెళ్లైన ఇద్దరు బాలికలు సేఫ్‌గా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.. అయితే, 20 రోజుల క్రితం జులై 22వ తేదీన రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో బాలికలు అపహరణకు గురయ్యారు. కిడ్నాప్ చేసిన విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ ను. అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా నాలుగు ప్రత్యేక బృందాలతో విజయనగరం, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ లో గాలింపు చర్యలు చేపట్టారు.. మొత్తంగా కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని.. ఆ ఇద్దరు చిన్నారులకు విముక్తి కల్పించారు.. మరికొద్ది గంటల్లో కిడ్నాపర్‌ను పోలీసులు అరెస్టు చూపించే అవకాశం ఉంది..

Read Also: WayanadFloodRelief: కేరళ వరద భాదితుల సహాయార్థం తనవంతుగా ధనుష్..

మరోవైపు, కిడ్నాపర్ పట్టుబడటంతో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.. విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ మోసగాడని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.. విజయనగరంలో ఒక యువతిని వివాహం చేసుకున్న వెంకటేష్.. భార్య ఉండగానే మరో మైనర్ బాలికతో ప్రేమాయణం నడిపాడట.. ఇక, ప్రియురాలును చెల్లిగా పరిచయం చేసి 3 నెలల క్రితం ధవళేశ్వరంలో ఓ ఇంట్లో కాపురం పెట్టాడట.. ప్రియురాలును గత నెల 22వ తేదీన రాజమండ్రిలో బస్సు ఎక్కించి విజయనగరం జిల్లాలోని ఆమె ఇంటికి పంపించిన మోసగాడు.. ధవళేశ్వంలో తాను ఉంటున్న ఇంటిలోనే అద్దెకు ఉన్న ఒడిశాలోని బరంపూర్ కు చెందిన ఇద్దరు మైనర్లను అపహరించాడు.. 20 రోజులుగా కిడ్నాపర్ వెంకటేష్‌తోనే ఉన్నారు ఆ ఇద్దరు బాలికలు.. అయితే, అక్కాచెల్లెళ్లును కిడ్నాప్ చేసిన మారోజు వెంకటేష్ పై గత నెల 29వ తేదీన ధవళేశ్వరం పోలీసులకు ఫిర్యా చేసింది తల్లి సునీత.. ఇక, రంగంలోని దిగిన పోలీసులు.. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. ఈ తెల్లవారుజామున కిడ్నాపర్ వెంకటేష్ ను పట్టుకున్నారు.. ఇద్దరు బాలికలను తల్లి సునీతకు అప్పగించారు పోలీసులు.

Show comments