తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో ‘గుంతలు పూడ్చే’ పనులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో గత ప్రభుత్వం కనీసం గుంతలు పడిన రోడ్లను బాగు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించుకుని ఉంటే ఇబ్బంది ఉండేది కాదని పేర్కొన్నారు. రోడ్ల పరిస్థితిపై గత ప్రభుత్వ కాలంలో అయితే వాళ్లు పోయలేదని సమాధానం చెప్పగలిగే వాళ్ళమని, ఇప్పుడు వెళ్లడానికి తమకే సిగ్గేస్తుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో నిధులు లేకపోయినా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్ల మరమత్తులకు 79 లక్ష రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని రోడ్లను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.
Read Also: B. C. Janardhan Reddy: గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారు..
మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రోడ్లన్నీ అద్వాన పరిస్థితికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల ప్రక్షాళనకు చర్యలు తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్లు వేసిన తర్వాత వాటిని కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని పేర్కొన్నారు. రోడ్లపై గుంతలు తవ్వడం.. చెత్తాచెదారాలు వేయడం, రోడ్లు పక్క ఆక్రమించి గడ్డి వంటివి పెంచడం వల్ల రోడ్లు పాడైపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉందని శేషారావు తెలిపారు.
Read Also: Narne Nithiin: హిట్టు కొట్టి సైలెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఎన్టీఆర్ బామ్మర్ది