బంగాళాఖాతంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు గల్లంతవడంతో ఆందోళన నెలకొంది. కాకినాడ జిల్లాలో బంగాళాఖాతంలో ఇంజన్ ఆగి నిలిచిపోయిందో బోటు. పర్లోవపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తమ బోటు భీమునిపట్నం వైపు బోటు కొట్టుకుపోతున్నట్లు సెల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపారు మత్స్యకారులు. ఆ తరువాత సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. దీంతో కుటుంబసభ్యులలో ఆందోళన ఏర్పడింది.
తమ బోటులో ఇంజన్ ఆగిపోయిందని మత్స్యకారులు సెల్ ఫోన్ ద్వారా సమాచారం పంపారు. సోమవారం నుంచి చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఏమయ్యారోనని కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. అధికారులు అప్రమత్తం అయి, వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. భీమునిపట్నంలో మెరైన్ అధికారులు రంగంలోకి దిగారు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు.