రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలోని ఇద్దరు అక్కాచెల్లెళ్ల అపహరణ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో నిందితుడు మారోజు వెంకటేశ్ నేర చరిత్ర బయటకు వస్తుంది. విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ ఇద్దరు మైనర్ బాలికలను అపహరించాడు. మారోజు వెంకటేష్ మోసగాడని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. విజయనగరంలో ఒక యువతిని వివాహం చేసుకున్న వెంకటేష్.. భార్య ఉండగా మరో మైనర్ బాలికతో ప్రేమాయణం సాగించాడు. ప్రియురాలిని చెల్లిగా పరిచయం చేసి ధవళేశ్వరంలో ఓ ఇంట్లో కాపురం పెట్టాడు మోసగాడు. మూడు నెలల క్రితం నిందితుడు రైల్వేలో టీసీగా పని చేస్తున్నాను అని చెప్పి అక్కాచెల్లెళ్లు ఉంటున్న ఇంటి పై పోర్షనులో అద్దెకు దిగాడు.
Read Also: Pawan Kalyan: రీరిలీజ్ కాబోతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మూవీ
ధవళేశ్వరంలో తాను ఉంటున్న ఇంటిలోనే అద్దెకు ఉన్న.. నిందితుడు వెంకటేశ్, మరో ఫోర్షన్ లో ఉంటున్న మహిళకు ఉద్యోగం పేరుతో మాయమాటలు చెప్పాడు. కాగా.. ఆ మహిళ తన భర్త నుంచి విడిపోయి ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటుంది. ఆమె తన ట్రాప్ లో పడిందని తెలియగానే ప్రియురాలిని విజయనగరం పంపించాడు. ఆ తర్వాత తాను ట్రాప్ చేసిన మహిళను ఉద్యోగం పేరుతో విజయవాడకు తీసుకెళ్లాడు. ఆమెను అక్కడే ఉంచి తాను తిరిగి ధవళేశ్వరం వచ్చాడు. అనంతరం.. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను హాస్టల్ కు తీసుకుని వెళ్తానని చెప్పి కిడ్నాప్ చేశాడు. కాగా.. అక్కాచెల్లెళ్లును కిడ్నాప్ చేసిన మారోజు వెంకటేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు. విజయనగరం, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్లలో పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.
Murari: సూపర్ స్టార్ క్రేజ్ మాములుగా లేదుగా.. 2 రోజుల్లో 7 కోట్లకి పైగా వసూళ్లు..