NTV Telugu Site icon

Rajahmundry: రాజమండ్రిలో చిరుత కలకలం.. అధికారుల కీలక సూచనలు

Leopard

Leopard

Rajahmundry: రాజమండ్రి శివారు ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని పట్టుకోడానికి ఆపరేషన్ కొనసాగుతుంది. దివాస్ చెరువు అటవీప్రాంతాలలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుతపులి కదలిక చిత్రాలు గుర్తించారు. చిరుతపులి ప్రస్తుతం దివాస్ చెరువు అటవీప్రాంతంలోనే ఉందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. చిరుతపులి పాదముద్రాలు కనుగొన్నారు. చిరుతపులి కదలికలను గుర్తించే నిమిత్తం సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలను కొన్ని ప్రదేశాలలో అమర్చారు.. దివాస్ చెరువు అటవీప్రాంతాన్ని అనుకొనిఉన్న అన్ని నివాస ప్రాంతాలను అటవీశాఖ సిబ్బంది క్రమం తప్పకుండా శోధిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి థర్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగించి శోధన ప్రారంభించారు. చిరుతపులి కదలికల కారణంగా రాజమండ్రిలోని లాలచెరువు హౌసింగ్ బోర్డు దగ్గర నుండి ఆటోనగర్ వరకు జాతీయ రహదారి16 పై వాహన ప్రయాణికులు నెమ్మదిగా గమనిస్తూ ప్రయాణించగలరని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దివాస్ చెరువు అటవీప్రాంతాన్ని అనుకొన్న NH16 కి సంబంధిత అధికారులను కలిసి జాతీయ రహదారిపై స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఏర్పాటు చేయిస్తున్నారు.

Read Also: Children Using Mobile: పిల్లలు ఎక్కువ సేపు మొబైల్ చూస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు సుమీ..