Jakkampudi Raja Protest: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మరోసారి పొటికల్ హీట్ పెరిగింది.. రాజా నగరం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. రాత్రి నుంచి కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.. మల్లంపూడికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఆయన కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పోలీస్ స్టేషన్ బయటే నిరసనకు దిగారు.. అర్ధరాత్రి మట్టితవ్వకాల దగ్గర జరిగిన పెనుగులాటతో ఈ వివాదం తలెత్తింది..
అయితే, జనసేన కార్యకర్త ఫిర్యాదుతో వైసీపీ సర్పంచ్, ఆయన కుమారుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. రాజకీయ అండదండలతో పోలీసులు తమ పార్టీకి చెందినవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అక్రమంగా మైనింగ్‌పై జిల్లా కలెక్టర్, తహశీల్దార్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని.. అడిగితే అడ్డగోలుగా కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..

