NTV Telugu Site icon

వీళ్లు మాములు ముదుర్లు కాదు… కొబ్బరికాయల లోడ్ చాటున గంజాయి

ఏపీలో రికార్డు స్థాయిలో గంజాయి పట్టుబడుతోంది. గంజాయి అక్రమ రవాణాపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గురువారం నాడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద మొత్తంలో గంజాయి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: 15 ఏళ్ల కుర్రాడి దారుణం.. యువతిని ఈడ్చుకెళ్లి, గొంతుకోసి…?

సుకుమామిడి బ్రిడ్జి వద్ద చింతూరు సబ్ డివిజన్ ఏ‌ఎస్‌పీ జి.కృష్ణకాంత్ పర్యవేక్షణలో చింతూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.యువకుమార్, మోతుగూడెం ఎస్సై వి.సత్తిబాబు, సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. కొబ్బరికాయల లోడ్ వేసుకుని వాటి కింద గంజాయిని లోడ్ చేస్తున్న ఐచర్ వాహనాన్ని వారు పట్టుకున్నారు. ఐచర్ వాహనానికి ముందు వెళుతున్న పైలట్ కారును సైతం సీజ్ చేశారు. కాగా తమకు పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.