Polavaram Project Files: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కలకలం రేపుతుంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి కార్యాలయంలో ఘటన చోటు చేసుకుంది. పోలవరం ఎడమ కాలువ భూ సేకరణ పరిహారానికి సంబంధించిన ఫైల్స్ ను తగలబెట్టిన కొందరు సిబ్బంది.. కార్యాలయం బయట అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదైన కొన్ని ఫైళ్ళు.. ఈ ఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ చేపట్టింది. కాలి బూడిదైన దస్త్రాలు పరిశీలించింది.
Read Also: Monsoon Brides: పాకిస్తాన్‌లో “రుతుపవన పెళ్లికూతుళ్లు”..
అయితే, పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలోని బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయట పడేశామని స్పెషల్ కలెక్టర్ సరళా వందనం తెలిపారు. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు.. సిబ్బంది తగల బెట్టిన కాగితాలు ఉపయోగం లేని మాత్రమే అని స్పెషల్ కలెక్టర్ వెల్లడించారు.
