District Collector P Prasanthi: పంటల సమయంలో ఎరువుల కొరత రైతులను ఇబ్బంది పెడుతోంది.. ముఖ్యంగా యూరియాతో రైతులతో పాటు ప్రభుత్వానికి కూడా తలనొప్పి తప్పడలం లేదు.. సీఎం, మంత్రులు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.. అయితే, ఎరువుల పంపిణీ విషయంలో అధికారులకు వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్.. రైతులను హెచ్చరించారు.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎరువుల సరఫరాలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
Read Also: Avoid These People: మైండ్ పీస్ కావాలంటే వీరి నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి!
ఇక, తనిఖీ సమయంలో ఎరువుల పంపిణీ జాబితాను పరిశీలించిన కలెక్టర్, “రెండు బస్తాలు ఇచ్చే చోట ఒక రైతుకి ఐదు బస్తాలు ఎందుకు ఇచ్చారు? ఏ ఆధారంపై ఇంత మోతాదు కేటాయించారు?” అని ప్రశ్నించారు. సిబ్బంది సమాధానంగా కొంతమంది రైతులు అదనంగా కోరుతున్నారని చెప్పగా, కలెక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఎరువుల కేటాయింపు పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా విస్తీర్ణం అనుసరించి జరగాలి, ఇది రైతులందరికీ సమానంగా లభించడానికి తీసుకున్న చర్యలో భాగం, సాయిల్ టెస్టు ఆధారంగా ఎంత మొత్తం వాడాలో స్పష్టం చేశారని తెలిపారు. ఒక రైతు ఎక్కువ తీసుకుంటే, మరొకరికి తక్కువ అవుతుంది. ఇది న్యాయం కాదు, మీపనితీరుమార్చుకోవాలి అని కలెక్టర్ పి. ప్రశాంతి హెచ్చరించారు.
