Site icon NTV Telugu

AP Liquor Scam Case: జగన్‌ ఎప్పుడైనా అరెస్ట్‌ కావొచ్చు..! డేట్‌ చెప్పలేం..

Nallamilli Ramakrishna Redd

Nallamilli Ramakrishna Redd

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ స్కామ్‌ కేసు సంచలనంగా మారింది. ఇప్పటికే కీలక వ్యాఖ్యలు అరెస్ట్‌ అయ్యారు.. అయితే, లిక్కర్ కుంభకోణంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ అరెస్ట్ ఖాయమని అంటున్నారు బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో డేట్ చెప్పలేమని చెబుతున్నారు. బిగ్ బాస్ ఎవరో చెప్పినట్లుగా సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తోందని అన్నారు. అప్పట్లో చంద్రబాబుని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసి, 53 రోజులు జైల్లో ఉంచినా ఆధారాలు చూపలేకపోయారని మండిపడ్డారు.. మద్యం స్కామ్ లో సిట్ ఆధారాలు సేకరించి అరెస్టులు చేస్తుందని వివరించారు .

Read Also: Prime Minister Narendra Modi: అమెరికా సుంకాల వేళ.. చైనాకు మోడీ..

ఇక, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే నావ, అందుకే ఆ పార్టీ కార్యక్రమాల్లో సీనియర్ నేతలు పాల్గొనడం లేదని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రాజమండ్రిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… గత 78 ఏళ్లలో లేని విధంగా కేంద్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కి పూర్తి సహకారం అందుతోందని అన్నారు. ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంలో వైఎస్‌ జగన్ ఉన్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రాకూడదనే మళ్లీ నేనే అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నారని తీవ్రంగా విమర్శించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

Exit mobile version