Annavaram Tragedy: అన్నవరం సత్యగిరి కొండపై విష్ణు సదన్ భవనం మూడో అంతస్తు పై నుంచి ప్రమాదవశాత్తు ఓ మహిళ జారీ పడింది. ఇక, హుటాహూటిన శ్యామల సింధు అనే మహిళను కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో మూడేళ్ల బాబు శ్యాకేత్ రామ్‌కి ఆమె అన్నం తినిపిస్తున్న సమయంలో, బాబుతో పాటు కింద పడిపోయినట్లు తెలుస్తుంది. కాగా, శ్యామల బాబుని గట్టిగా పట్టుకుని ఉండటంతో బరువు మొత్తం కాళ్లపై పడటంతో ఆమెకు మాత్రమే తీవ్ర గాయాలు అయ్యాయి.
Read Also: Singapore: ఎరక్క పోయి.. ఇరుక్కు పోయారు.. సె*క్స్ వర్కర్లపై దాడి.. ఇండియన్స్ అరెస్ట్
ఇక, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స అవసరం ఉంది.. కానీ ఎటువంటి ప్రాణాపాయం లేదని తేల్చ చెప్పారు. భవనం కిందికి నేరుగా పడిపోకుండా ముందుగా సన్‌సైడ్ పైకి తాకి తర్వాత కిందపడటంతో పెను ప్రమాదం తప్పింది అన్నారు. మలికిపురం నుంచి బంధువుల వివాహానికి వచ్చిన శ్యామల కుటుంబం ఈ దుర్ఘటనకు గురైంది.తల్లి ధైర్యంగా బాబును పట్టుకోవడంతో బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు.. శ్యామలకు మాత్రం గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
